Preity Zinta : ప్రీతి జింతాకు కవల పిల్లలు పుట్టారు.. కానీ ఆమె కనలేదు..!

November 18, 2021 4:10 PM

Preity Zinta : సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు సినిమాల‌తోపాటు బిజినెస్ వ్య‌వ‌హారాల‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ ద్వారా ప్రీతి జింతా వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.

Preity Zinta got twins but she did not give birth

2016లో ప్రీతి జింతా ఫారెన్ బిజినెస్ మ్యాన్ జీన్ గుడెనఫ్‌ని పెళ్లి చేసుకోగా, స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల‌య్యారు. ఈ హ్యాపీ న్యూస్ ని స్వయంగా ప్రీతి జింతా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ‘హాయ్.. ఈరోజు మీతో నేను ఒక అమేజింగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. నేను, జీన్ ఎంతో సంతోషంతో ఈ వార్తని ప్రకటిస్తున్నాం.

మా జీవితాల్లో సంతోషం, వెలుగు నిండేలా కవల పిల్లలని పొందాము. ఈ కొత్త ప్రయాణం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సరోగసి ద్వారా మాకు పిల్లలు పుట్టడంలో సహకరించిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెకు శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తోంది. తన కవల పిల్లలకు ‘జై జింతా గుడెనఫ్’, ‘జియా జింతా గుడెనఫ్’ అనే పేర్లతో నామకరణం చేసినట్లు ప్రీతి జింతా ప్రకటించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now