Koratala Siva : కొర‌టాల మైండ్‌లో మ‌ల్టీ స్టార‌ర్‌.. హీరోలెవ‌రో తెలిస్తే షాక‌వుతారు..!

November 18, 2021 8:24 AM

Koratala Siva : ర‌చ‌యిత నుండి ద‌ర్శ‌కుడిగా మారి హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ప్ర‌స్తుతం ఆచార్య పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న కొర‌టాల శివ ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

Koratala Siva to do a multi starrer film know who are heroes

ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబోలో మూవీ రాబోతుంది. వీలైనంత తొందరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే నెలలో ఎన్టీఆర్ మినహా.. మిగతా షూటింగ్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ చేయనున్నారట. అయితే కొర‌టాల నుండి త్వ‌ర‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని తెలుస్తోంది.

బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబుల‌తో కొర‌టాల శివ ఓ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి స‌మాచారం అందుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు సిద్ధంగా ఉన్నారు. త్వ‌ర‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.

అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయ‌నున్నారు బాలయ్య. ఇది పూర్తైన వెంట‌నే బాల‌కృష్ణ‌ – కొర‌టాల చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ని, ఇందులో మ‌హేష్ బాబు కూడా క‌నిపించ‌నున్నారని స‌మాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment