Janhvi Kapoor : జాన్వీ కపూర్ అభిమానుల‌కి పెద్ద షాక్.. ఇప్ప‌ట్లో తెలుగులోకి రాన‌ట్లే..!

November 17, 2021 7:12 PM

Janhvi Kapoor : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సక్సెస్ తో ఆయనకు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఈ సినిమా తర్వాత బోనీకపూర్, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అరవింద్ లతో కలిసి సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Janhvi Kapoor may not enter into tollywood now

ముఖ్యంగా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చూస్తున్నారట. ఈ విషయంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.

లేటెస్ట్ గా వస్తున్న మరో వార్త ప్రకారం బోనీకపూర్ కూతురు జాన్వీ కపూర్ ను టాలీవుడ్ లో ఓ సినిమాతో పరిచయం చేయాలని చూస్తున్నారు. ఈ బ్యూటీ అందచందాలతో తెలుగులో తనతో కలిసి నటించి.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని టాలీవుడ్ యంగ్ హీరోలు తెగ ఆసక్తిగా ఉన్నారు.

హిందీ నుండి అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాలో నటిస్తూ.. బజ్ క్రియేట్ చేసింది. ఇక జాన్వీ కపూర్ ను కూడా తెలుగులో పరిచయం చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఇక జాన్వీకపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి బోనీకపూర్ కు ఇంట్రెస్ట్ లేదట. ముందుగా శ్రీదేవిలా హిందీలో స్టార్ డమ్ తెచ్చుకున్నాకే.. తెలుగులో పరిచయం చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ క్రమంలో జాన్వీతో కలిసి తెలుగులో యాక్ట్ చేయాలనుకుంటున్న హీరోలు నిరాశ పడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment