Chiranjeevi Godfather : చిరంజీవితో రొమాన్స్ చేసిన హీరోయిన్ ఇప్పుడు చెల్లెలుగా నటిస్తుందా ?

November 17, 2021 4:42 PM

Chiranjeevi Godfather : 1990ల‌లో ఎన్నో సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేసిన చిరంజీవి మ‌ధ్య‌లో గ్యాప్ తీసుకున్నారు. ఖైదీ నం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసిన చిరు, ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.

Chiranjeevi Godfather once his heroine now she became sister for the movie

ప్ర‌స్తుతం ’గాడ్ ఫాదర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్‌ అయిన ‘లూసిఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ‘గాడ్ ఫాదర్’ మూవీని ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి స‌ర‌స‌న ‘అల్లుడా మజాకా’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’ తదితర చిత్రాలలో క‌థానాయిక‌గా న‌టించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు ఆయ‌న‌కు చెల్లెలుగా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రంలో చిరు చెల్లెలు పాత్రకు ప్రాధాన్యం ఉంది.

ఆ పాత్ర కోసం రమ్యకృష్ణని ఎంచుకున్నారని సమాచారం. ర‌మ్య కూడా ఈ పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అతిథి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now