Actress Chaurasia : నటిని పొద‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం.. దాడి చేసింది ఓ సైకోనట!

November 16, 2021 2:07 PM

Actress Chaurasia : టాలీవుడ్ సినీ నటి శాలు చౌరాసియాపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నిందితుడ్ని పోలీసులు వెంటనే గాలించారు. ఈ దాడిలో నటి చౌరాసియాతో నిందితుడు అసభ్యంగా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నాయి. అలాగే నిందితుడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో నటి చౌరాసియా ముఖంపై గుద్దినట్లు ఆమె తెలియజేసింది. ఆమెను చెట్ల పొదల్లోకి నిందితుడు లాకెళ్ల‌డానికి ట్రై చేశాడని పోలీసులు తెలిపారు.

Actress Chaurasia got attacked by a man who is a psycho say police

ఈ నేపథ్యంలో నటి చౌరాసియాపై కాలి మడమకు ఫ్రాక్చర్ అయ్యిందని అంటున్నారు. ఈ నిందితుడు ఒక సైకోగా అంచనా వేస్తున్నారు. కేబీఆర్ పార్క్ లో జాగింగ్ కు వెళ్ళిన చౌరాసియాపై సైకో దాడి చేశాడు.

ప్రస్తుతం స్టార్ బక్స్ ఎదురుగా ఉన్న ఈ ప్లేస్ ఎన్నో దారుణాలకు వేదిక‌గా మారింద‌ని పోలీసుల సమాచారం. అందుకే వాకింగ్ కి వెళ్ళేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొండాపూర్ లో నివసిస్తున్న శాలు చౌరాసియా.. తెలుగు, తమిళం సినిమాల్లో యాక్ట్ చేసింది.

ఆమె ఆదివారం సాయంత్రం 6:30 గంట‌లకు కేబీఆర్ పార్కుకు వాకింగ్ కు వెళ్లింది. ఇంతలో ఆ సైకో వచ్చి ఆమె మూతికి గుడ్డ కట్టి లాకెళ్ల‌డానికి ప్రయత్నించాడు. పోలీసుల ఎంక్వయిరీలో ఆ నిందితుడు సైకోగా నిర్ధారణ అయ్యింది. అతన్ని వెతికి పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ పార్క్ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల్లోనూ అత‌ని ఆచూకీ కోసం వెదుకుతున్నారు. అనుకోని ఈ ఘటన జరగడంతో శాలు చౌరాసియా తీవ్రంగా షాక్ అయినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment