Tollywood : క‌మెడియ‌న్స్ అంద‌రూ ఇలా క‌లిశారు.. గ్రూప్ పిక్ అదిరిపోలా..!

November 15, 2021 5:43 PM

Tollywood : ఒక సినిమాకి హీరో, హీరోయిన్, విలన్ పాత్రలు ఎంత ముఖ్యమో కమెడియన్ కూడా అంతే ముఖ్యం. కామెడీ పండించాలంటే ఆ వ్యక్తికి నవరసాల పోషణ తెలిసుండాలి. ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించాడు. హీరోల‌ను కూడా ప‌క్కన పెట్టి క‌మెడియ‌న్స్ కోస‌మే సినిమాలు చూసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం వ‌ల్ల చాలా మంది కమెడియ‌న్స్ వెలుగులోకి వ‌చ్చారు.

Tollywood comedians get together party

ప్రజంట్ జనరేషన్ కమెడియన్స్ అంతా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఫ్లయింగ్ కలర్స్ అనే పేరుతో ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని, ఎప్పటికప్పుడు కలుస్తుంటారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా సంవత్సర కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి గెట్ టు గెదర్ లా పార్టీ చేసుకున్నారు.

తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని ఒక పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ యాక్టర్ ధనరాజ్ ఫోటోతోపాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. అంద‌రు క‌మెడియ‌న్స్ ఒకే చోట క‌నిపిస్తూ ఉంటే ఈ ఫ్రేమ్ అభిమానుల‌కి క‌నుల పండుగ‌గానే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now