Suriya : రియల్ సినతల్లికి వ‌రాల వ‌ర్షం.. మొన్న లారెన్స్, నేడు హీరో సూర్య..

November 15, 2021 4:17 PM

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా జై భీమ్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ ఫుల్‌ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. సినతల్లిగా నటి లిజోమోల్ యాక్ట్ చేశారు. ఈమె పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ జై భీమ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Suriya helps parvati ammal donated rs 10 lakhs

పోలీస్ కస్టడీలో లాకప్ డెత్ లో చనిపోయిన వ్యక్తికి అన్యాయం జరిగిందని ఆయన భార్య చేసిన న్యాయ పోరాటమే ఈ కథ నేపథ్యం. ఈ సినిమా తెలుగు, తమిళం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సెలెబ్రిటీలతోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్.. జై భీమ్ సినిమా డైరెక్టర్ ను ఎంతగానో పొగిడారు. అలాగే సూర్యకు అభినందనలు తెలియజేస్తూ.. లెటర్ కూడా రాశారు.

లేటెస్ట్ సమాచారం ప్రకారం రియల్ సినతల్లి అయిన పార్వతి అమ్మాళ్ కు హీరో సూర్య 10 లక్షల రూపాయల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ డబ్బుపై వచ్చే వడ్డీని ప్రతినెల పార్వతి అమ్మాళ్ కు అందేలా చేశారు. ఈ విషయాన్ని సూర్య తన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అలాగే ఇటీవల పార్వతి అమ్మాళ్ కుటుంబానికి అండగా నిలబడి, ఆమెకు ఇల్లు కట్టిస్తానని కోలీవుడ్ హీరో, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now