Samantha : పుష్పలో స‌మంత ఐటమ్‌ సాంగ్ చేయ‌నుందా..?

November 14, 2021 6:27 PM

Samantha : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప ఒక‌టి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తుండ‌గా, అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ మూవీ  విడుదలకానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు . ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి” పాటలు విడుదలై అదరగొడుతుండగా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అనే పాట‌ని నవంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.

Samantha may dance in pushpa movie song

ఈ సినిమాలో ఒక ఐటమ్‌ సాంగ్ ఉండ‌గా, దాని కోసం వాళ్లు.. వీళ్లు.. అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జ‌రుగుతూ వ‌చ్చింది. కానీ సుకుమార్ చివ‌రికి స‌మంత‌ను ఫిక్స్ చేశాడు. ఆయ‌న తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగమ్మ.. మంగమ్మా.. అంటూ ఆడి, పాడి జనాల్ని ఆకట్టుకున్న సమంతనే పుష్పలో ఐటమ్ సాంగ్ చేయబోతోందని తెలుస్తోంది. సుకుమార్‌పై ఉన్న‌ గౌరవంతోనే సమంత ఈ ఐటమ్ సాంగ్ కు ఒప్పుకున్నట్లు సమాచారం.

విడాకుల త‌ర్వాత స‌మంత వ‌రుస సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. మరోవైపు త‌న స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. సోష‌ల్ మీడియాలో ఇంట్రస్టింగ్ కోట్స్ కూడా సామ్ షేర్ చేస్తోంది. మై మామ్స్ సెయిడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now