Bigg Boss 5 : ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్న‌ లేడీ కంటెస్టెంట్ ఎవ‌రంటే..?

November 13, 2021 4:53 PM

Bigg Boss 5 : 19 మంది స‌భ్యుల‌తో మొద‌లైన బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు హౌజ్ నుండి 9 మంది వెళ్లిపోగా ప్ర‌స్తుతం 10 మంది హౌజ్‌లో ఉన్నారు. జ‌స్వంత్ రీసెంట్ గా సీక్రెట్ రూంకి వెళ్లాడు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి ఏం బాగోలేదు. అతను కూడా బ‌య‌ట‌కు వ‌స్తాడ‌నే టాక్ న‌డుస్తోంది. అయితే ఈ వారం నామినేష‌న్ ప్రక్రియ కాస్త కొత్త‌గా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

Bigg Boss 5 this lady contestant will be eliminated this week

బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న సంకెళ్లను పట్టుకుని తమకు ఇష్టమైన వాళ్లని విడిపించవచ్చని చెప్పారు. ఆ విడుదలైన సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరు నామినేట్ అయి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఈ ప్ర‌క్రియ ఆస‌క్తిక‌రంగా సాగ‌గా, చివరికి జైలులో మానస్, సిరి, సన్నీ, రవిలు మిగిలారు అయితే బిగ్‏బాస్ మరోసారి యానీ మాస్టర్ కు లక్కీ ఛాన్స్ ఇచ్చాడు.

ఇంటి సభ్యులలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఆమె మరో ఆలోచన లేకుండా కాజల్‏ను నామినేట్ చేసింది. మొత్తంగా.. పదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిరి, మానస్, సన్నీ, రవి, కాజల్ నామినేట్ అయ్యారు. అయితే వీరిలో కాజ‌ల్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందట. మొదటి నుంచీ ఈమెపై షో ఫాలోవర్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కంటే ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాకే ఎక్కువగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెను ఎలిమినేట్ చేశార‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment