Guntur : గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఈసీజీ కోసం వెళ్తే బట్టలిప్పమన్నాడు!

November 13, 2021 10:44 PM

Guntur : ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావించి వారి వద్దకు పరుగులు తీస్తారు. అయితే వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా కొన్నిసార్లు తమ వక్రబుద్ధిని బయట పెడుతుంటారు. ఇలా గుంటూరు జీజీహెచ్ లో దారుణమైన బాగోతం బయటపడింది.

Guntur government ecg technician misbehave with woman

ఆ హాస్పిటల్‌కు నిత్యం ఎంతో మంది వైద్య సేవల కోసం పరుగులు పెడుతుంటారు. తాజాగా పాత గుంటూరుకు చెందిన ఓ యువతి ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డాక్టర్ ఈసీజీ చేయించాలని సూచించడంతో వారు ల్యాబ్ కు వెళ్లారు.

అయితే అక్కడ ఈసీజీ పరీక్షలు చేసే టెక్నీషియన్ హరీష్ అనే యువకుడు ఆ యువతి తల్లిదండ్రులను బయటకు పంపించి తన ఒంటిపై ఉన్న బట్టలను తొలగించాలని చెప్పాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో.. బట్టలు తీయకపోతే రిపోర్టులు సరిగా రావని చెప్పడంతో.. ఆ యువతి చేసేదేమీ లేక బట్టలు విప్పి కళ్ళు మూసుకుని పడుకుంది.ఈ క్రమంలోనే హరీష్ సెల్ ఫోన్ లో ఆమె చిత్రాలను బంధించడం చూసి నిర్ఘాంత పోయిన ఆ యువతి వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.

ఈ క్రమంలోనే ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. అసలు ల్యాబ్ లో పని చేస్తున్న హరీష్ అనే యువకుడు సిబ్బంది కాదని వెల్లడైంది. అక్కడ పరీక్షలు చేసే వైద్యుడు అనారోగ్యంతో ఉండటం వల్ల ఆయన తన విద్యార్థిని అక్కడ పెట్టాడు. అయితే ఆ విద్యార్థి కూడా విధులకు హాజరు కాలేదు. దీంతో సంబంధం లేని హరీష్‌ ల్యాబ్ లో పనిచేస్తున్నాడని తేలింది. ఈ క్రమంలోనే అతను అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్నాడని తేలింది.

దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హరీష్ కేవలం ఆ యువతి పట్ల మాత్రమే అలా ప్రవర్తించడా.. లేక ఇంకా ఎంత మందితో ఈ విధంగా ప్రవర్తించాడు.. అంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్లను మాత్రం వదలకుండా కఠినంగా శిక్షించాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now