Katrina Kaif : రాజస్థాన్ కోటలో పెళ్ళి చేసుకోనున్న కత్రినా, విక్కీ కౌశల్.. !

November 12, 2021 10:02 PM

Katrina Kaif : బాలీవుడ్ స్టార్ నటీనటులైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల వివాహం జరగబోతుంది. దీనికోసం రాజస్థాన్ లో సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 7 నుండి 12 తేదీల మధ్య ఉన్న డేట్స్ లో వీరి వివాహం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే పెళ్ళికి సంబంధించిన హోటల్ కూడా బుకింగ్స్‌ పూర్తయినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీఐపీ వివాహాలను ఆర్గనైజ్ చేయడానికి ఈవెంట్ కంపెనీల ఏజెంట్స్ ఈ సవాయ్ మాధోపూర్ లో ఉన్న హోటల్ రూమ్స్ ని వెతుకుతున్నారట.

Katrina Kaif to marry vicky kaushal in rajasthan fort

అలాగే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల టీమ్ కూడా వీరి పెళ్ళికి పనులు స్టార్ట్ చేశారు. పెళ్ళికి సంబంధించిన పనులు చెక్ చేసేందుకు.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల పర్సనల్ అసిస్టెంట్స్ 10 మంది వరకు రీసెంట్ గా సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుని పరిశీలించారు. అలాగే హోటల్ యాజమాన్యం అందించిన సమాచారం మేరకు పెళ్ళికి సంబంధించిన అన్ని పనలు చకచకా జరుగుతున్నట్లు తెలిపారట.

ఇక పెళ్ళి కొడుకు గుర్రం మీద కూర్చుని ఎక్కడ నుండి వస్తారు.. మెహందీ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు, సంగీత్ ప్లాన్ ఏంటి.. ఇలాంటవన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే పెళ్ళిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now