Adipurush : అద్భుతం.. కేవ‌లం 103 రోజుల్లోనే ఆది పురుష్ షూటింగ్ పూర్తి..!

November 11, 2021 6:29 PM

Adipurush : ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్‌.. ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. కృతి స‌నన్ సీత‌గా చేస్తోంది. ఇక రావ‌ణాసురుడి పాత్ర‌ను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో స‌న్నీ సింగ్ న‌టించారు.

Adipurush shooting completed in 103 days

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో 3డిలో ఈ మూవీని చిత్రీక‌రిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్ల‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి 3 నెల‌ల‌కు పైగానే అవుతోంది. మ‌రోవైపు పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యేందుకే కొన్ని ఏళ్లు ప‌డుతుంద‌ని అనుకున్నారు. కానీ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచేస్తూ ఈ చిత్ర షూటింగ్ కేవ‌లం 103 రోజుల్లోనే పూర్త‌యింది. అవును.. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ స్వ‌యంగా తెలియ‌జేశారు.

ఆది పురుష్ మూవీ షూటింగ్ 103 రోజుల్లో పూర్త‌య్యింది. ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.. అని అన్నారు. కాగా ఈ మూవీని భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్ నిర్మించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు ప్ర‌భాస్ రాధేశ్యామ్ మూవీతోనూ అల‌రించ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now