Jabardasth : జబర్దస్త్ షో నుంచి మాయమైన రోజా..? రోజా స్థానాన్ని భర్తీ చేసిన ఇంద్రజ..?

November 8, 2021 12:44 PM

Jabardasth : బుల్లితెరపై కొన్ని సంవత్సరాల నుంచి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా రోజా, నాగబాబు వ్యవహరించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు మధ్యలో వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చారు.

Jabardasth indraja might replace roja

ఇలా జబర్దస్త్ షో నుంచి ఎంతమంది వెళ్లిపోయినా కానీ రోజా మాత్రం అక్కడే పర్మినెంట్ గా తిష్ట వేసుకుని కూర్చున్నారు. అయితే రోజా ఒకవైపు రాజకీయాలలో, మరొకవైపు బుల్లితెర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొన్ని సార్లు రాజకీయ పనులవల్ల ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రోజా స్థానంలో నిర్వాహకులు మరొక జడ్జిని భర్తీ చేస్తూ వస్తున్నారు.

అయితే గత కొద్ది రోజుల క్రితం రోజా తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా జబర్దస్త్ కార్యక్రమానికి కొంత విరామం ఇచ్చారు. ఈ విరామ సమయంలో రోజా స్థానాన్ని నటి ఇంద్రజ ఆక్రమించుకున్నారు. ఇంద్రజ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఇకపై రోజా స్థానంలో ఇంద్రజ పర్మినెంట్ గా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే రోజా మాత్రం తన స్థానాన్ని తను దక్కించుకుంది.

తాజాగా మరోసారి రోజా జబర్దస్త్ కార్యక్రమం నుంచి రోజా మాయమైనట్లు తెలుస్తోంది. రోజా రాజకీయాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. రోజా ఇలాగే కనుక రాజకీయాల్లో బిజీగా ఉంటే తన స్థానాన్ని ఇంద్రజ కైవసం చేసుకోవడం ఖాయం.. అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now