Lijomol : ఆ సమయంలో కన్నీళ్ళు అస్స‌లు ఆగలేదు, ఏడుస్తూనే ఉన్నా: జై భీమ్ న‌టి

November 8, 2021 10:57 AM

Lijomol : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా జై భీమ్. ఈ సినిమాలో లాయర్ పాత్రలో సూర్య యాక్టింగ్ అద్భుతం అనే చెప్పాలి.  జై భీమ్ సినిమాలో హీరో సూర్య పాత్ర తర్వాత అంతే పేరు సంపాదించుకున్న క్యారెక్టర్ చిన్నతల్లి. గిరిజన మహిళగా, నిండు గర్భిణిగా తన భర్త కోసం పోరాడే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా గిరిజన ప్రజలపై పోలీసులు అమానుషంగా ఎలా కేసులు పెడతారు, వారితో ప్రవర్తన ఎలా ఉంటుంది.. అనే అంశాల్ని కీలకంగా తెరకెక్కించారు డైరెక్టర్.

Lijomol said that she cried even after completing scene shooting

1993లో తమిళనాడులో ఓ గిరిజన మహిళ కోసం లాయర్ చంద్ర చేసిన పోరాటమే జై భీమ్ సినిమా. చిన్నతల్లి పాత్రలో నటి లిజోమోల్ యాక్ట్ చేశారు. ఈమె పాత్ర పూర్తిగా డీ గ్లామర్ రోల్. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ప్రశంసలు సంపాదించుకుంటోంది. తన పాత్ర గురించి ఈ నటి ఇంట్రెస్టింగ్ విశేషాల్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా తనపై ఎక్కువగా ప్రభావం చూపించిందని అంటోంది. మరీ ముఖ్యంగా చిన్నతల్లి పాత్రలో నటిస్తున్నప్పుడు గ్లిజరిన్ లేకుండానే ఏడుపు సీన్స్ లలో నటించానని తెలిపింది.

ఇప్పటి వరకు తాను చేసిన క్యారెక్టర్స్ లో ఈ పాత్ర తనకు ఎప్పటికీ గుర్తుంటుందని, అలాగే ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటోంది. ఈ సినిమాలో ఎన్నో సీన్స్ లో చిన్నతల్లిని పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తారు. ఆ సీన్స్ లో నటించేటప్పుడు ఆమె గ్లిజరిన్ ఉపయోగించలేదని నటి లిజో తెలిపింది. ఆ సీన్ వివరించినప్పుడు తనకు ఆటోమేటిక్ గా కన్నీళ్ళు వచ్చేవని అన్నారు. అలాగే డైరెక్టర్ సీన్ ఒకే అయ్యాక.. కట్ చెప్పినా కూడా కన్నీళ్ళు ఆగేవి కాదని.. లిజోమోల్ తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now