Hyper Aadi : అజ్ఞాతంలో హైప‌ర్ ఆది..? అత‌నిపై దాడి చేసేందుకు తిరుగుతున్న ఆ హీరో అభిమానులు..?

November 8, 2021 8:51 AM

Hyper Aadi : హైప‌ర్ ఆది.. ఈ పేరు తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా హైప‌ర్ ఆది పాపుల‌ర్ అయ్యాడు. జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై అత‌ను వేసే పంచ్‌ల‌కే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. అయితే ఆది పంచ్‌లు వేస్తే చూసేందుకు, వినేందుకు బాగానే ఉంటాయి. కానీ కొన్ని సార్లు అత‌ను వేసే పంచ్‌ల వ‌ల్ల ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంటుంది.

Hyper Aadi reportedly in hiding after making comments on that hero

గ‌తంలో ప‌లువురు హీరోల‌పై పంచ్‌లు వేసిన ఆది ఇబ్బందులు ప‌డ్డాడు. త‌రువాత క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ఆదికి అదే లాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో నిర్వ‌హించిన షోలో పాల్గొన్న ఆది బాగా సంద‌డి చేశాడు. త‌న పంచ్‌ల‌తో క‌డుపుబ్బా న‌వ్వించాడు. దీంతో షో కూడా బాగానే కొన‌సాగింది. అయితే ఓ టాలీవుడ్ హీరోపై అత‌ను పంచ్‌లు వేయ‌డాన్ని ఆ హీరో అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో ఆ హీరో అభిమానులు ఆదిని బ‌య‌ట క‌నిపిస్తే చిత‌క్కొడదాం.. అన్న రేంజ్‌లో ఫైర్ అవుతున్నార‌ట‌.

ఆ హీరోపై ఆది వేసిన పంచ్‌ల‌కు ఆదిని చిత‌క‌బాదాల‌ని ఆ ఫ్యాన్స్ ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ట‌. దీంతో ఆది క‌నిపిస్తే చాలు, దాడి చేద్దాం.. అన్నంత క‌సిగా వారు తిరుగుతున్నార‌ట‌. దీంతో ఆది బ‌య‌ట తిరిగేందుకు భ‌య‌ప‌డుతున్నాడ‌ని, ఒక వేళ తిరిగినా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వెళ్తున్నాడ‌ని.. టాక్ వినిపిస్తోంది.

మ‌రి ఆది ఈసారి కూడా క్ష‌మాప‌ణ‌లు చెబుతాడా ? లేదా అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌వుతాడా ? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఆది ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తున్నాడు. అయితే అత‌ను వేసే పంచ్‌లు బాగానే ఉంటాయి కానీ, ఒక‌రిని కించ ప‌రిచేలా పంచ్‌లు వేస్తే.. ఇదిగో.. ఇలాగే జ‌రుగుతుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment