Bhimla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌మాండింగ్ చేస్తానంటున్న నిత్యా మీన‌న్..!

November 7, 2021 11:36 PM

Bhimla Nayak : నిత్యా మీన‌న్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న భీమ్లా నాయ‌క్ చిత్రంలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె ప‌వ‌న్‌కు భార్య‌గా న‌టిస్తోంది. అయితే ఆమెకు చెందిన సినిమాలోని పాత్ర గ్లింప్స్‌ను మేక‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేయ‌లేదు. కానీ తాజాగా నిత్య‌, ప‌వ‌న్ న‌టించిన ఓ సాంగ్‌ను మాత్రం రిలీజ్ చేశారు. దీంతో నిత్య భిన్న‌మైన లుక్‌లో ఈ మూవీలో క‌నిపించ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Bhimla Nayak nithya says she commands pawan in movie

ఇక ప‌వ‌న్‌తో షూటింగ్ చేయ‌డంపై నిత్యా మీన‌న్ స్పందించింది. ఈ మూవీలో త‌న క్యారెక్ట‌ర్ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ క్యారెక్ట‌ర్ క‌న్నా భిన్నంగా ఉంటుంద‌ని తెలిపింది. ఒరిజిన‌ల్ చిత్రంలో రోల్ చిన్న‌ద‌ని, కానీ ఈ మూవీలో త‌న పాత్ర నిడివిని పెంచార‌ని, తాను ఈ చిత్రంలో త‌న భ‌ర్త‌ను క‌మాండింగ్ చేసే మ‌హిళ‌లా క‌నిపిస్తాన‌ని తెలిపింది.

త్రివిక్ర‌మ్‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని నిత్య చెప్పుకొచ్చింది. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌తో కేవ‌లం 4-5 రోజులు మాత్ర‌మే షూటింగ్ చేశాన‌ని, అయిన‌ప్ప‌టికీ ఎంతో మ‌ధురానుభూతి క‌లిగింద‌ని తెలిపంది. ప‌వ‌న్ చాలా ప్ర‌శాంతంగా ఉంటార‌ని, నెమ్మ‌ద‌స్తుల‌ని తెలిసింది. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం సాలా సుల‌భ‌మ‌ని చెప్పింది.

ఇక భీమ్లా నాయ‌క్‌లో రానా కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌ళ‌యాళం సినిమా అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా భీమ్లా నాయ‌క్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2022 జ‌న‌వ‌రి 12వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now