Bigg Boss 5 : మానస్ అంటే ఇష్టమంటూ.. ఎమోషనల్ అయిన కాజల్..!

November 7, 2021 2:17 PM

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఎంతో చనువుగా ఉన్న కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, కొట్లాటలు మొదలవుతాయి. అయితే కొందరు మాత్రం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వారి మధ్య ఉన్న రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు.

Bigg Boss 5 kajal says she like manas very much

ఇక బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీలు, గాసిప్పులు మాట్లాడటంలో కాజల్ అందరి కన్నా ముందే ఉండేది. మొదట్లో ఈమె అందరి దగ్గర వారి వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ఈమెకు ఏకంగా బ్రోకర్ అనే పేరు కూడా పెట్టేశారు. అయితే ప్రస్తుతం కాజల్ హౌస్ లో సన్నీ, మానస్ లతో ఎంతో చనువుగా ఉంటోంది. గత కొద్దిరోజుల నుంచి వీరితో చనువుగా ఉన్న కాజల్ ను తాజా ఎపిసోడ్ లో మానస్ దూరం పెట్టినట్టు గమనించవచ్చు.

ఈ క్రమంలోనే తనని దూరం పెట్టడానికి కారణం ఏంటి అంటూ కాజల్ అడిగింది. అందుకు స్పందించిన మానస్.. మనిద్దరి మధ్య ఏముంది ? మనది ఏ రకమైన ఫ్రెండ్ షిప్.. అని అందరూ అడుగుతున్నారు.. అంటూ మానస్ చెప్పాడు. అందుకు కాజల్.. మనిద్దరి గురించి అలా అనుకుంటున్నారా.. అంటూ ఎమోషనల్ అయ్యింది.  అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్‌ ఏమిటనేది.. నిజానికి వారే తేల్చుకోవాల్సి ఉంది. ఇక బ్రదర్‌, సిస్టర్‌.. అంటూ కాజల్, మానస్, ప్రియాంకలు మరో వైపు మాట్లాడుకోవడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment