Tollywood : భార్యకు విడాకులు ఇచ్చి.. బ్యాచిలర్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న యంగ్‌ డైరెక్టర్‌..!

November 7, 2021 10:58 AM

Tollywood : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతోపాటుగా డైరెక్టర్లకు కూడా స్టార్ డమ్ ఉండటం సహజం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని అటు హీరోలతోపాటు ఇటు నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో డైరెక్టర్ల పర్సనల్ విశేషాలపై అభిమానులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి ఓ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ ఒకరు రీసెంట్ గా తన భార్య నుండి విడాకులు తీసుకున్నారు.

Tollywood young director enjoying bachelor life by giving divorce to his wife

భార్యభర్తలుగా కలిసి జీవించడంలో ఇంట్రెస్ట్ లేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకులపై లీగల్ ప్రాసెస్ జరుగుతోంది. అలాగే వీరిద్దరూ వారి జీవితంలో మరో అడుగు ముందుకు వేశారు. నటుడిగా తన టాలెంట్ ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత మూడేళ్ళ నుండి ఈ డైరెక్టర్ ఫీచర్ సినిమా చేయలేదు. ప్రస్తుతం యాక్టర్ గా.. ప్రజంటర్ గా ఎన్నో ఆఫర్స్ ని సొంతం చేసుకుంటున్నారు. అలాగే తన కెరీర్ మీద కంప్లీట్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక తన వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్న సందర్భంలో తన ఫ్రెండ్స్ అందరికీ పబ్ లో పార్టీ ఇచ్చి సెలెబ్రేట్ చేసుకున్నారు. సింగిల్ స్టేటస్ ని అనౌన్స్ చేస్తూ.. మళ్ళీ బ్యాచిలర్ గా ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యాడు. సీనియర్ యాక్టర్ తో కలిసి డైరెక్షన్ చేసే అవకాశానికి బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో ఆ డైరెక్టర్ కొంచెం కూడా బాధపడలేదు. తన ఫస్ట్ సినిమాతోనే విశేషమైన ఆదరణతోపాటు ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న డైరెక్టర్ ఇప్పుడు తన పేరు, ప్రతిష్టల్ని పెంచుకుంటూ భారీ ప్రాజెక్ట్స్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now