ఐక్యూ 7 లెజెండ్ 5జి స్మార్ట్ ఫోన్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

April 27, 2021 4:44 PM

మొబైల్స్ త‌యారీదారు ఐక్యూ కొత్తగా ఐక్యూ 7 లెజెండ్ 5జి (iQOO 7 Legend 5G) ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

iQOO 7 Legend 5G smart phone launched in india

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. కూలింగ్ కోసం ప్ర‌త్యేకంగా వేప‌ర్ చాంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 13 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అమ‌ర్చారు. దీనికి 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. దీంతో ఈ ఫోన్ కేవ‌లం 22 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ అవుతుంది.

ఐక్యూ 7 లెజెండ్ 5జి ఫీచ‌ర్లు

  • 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌, 8/12 జీబీ ర్యామ్
  • 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
  • 48, 13, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2
  • యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఐక్యూ 7 లెజెండ్ 5జి ఫోన్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.39,990 ఉండ‌గా, 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.43,990గా ఉంది. ఈ ఫోన్‌ను మే 1వ తేదీ నుంచి అమెజాన్‌తోపాటు ఐక్యూ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్ర‌యిస్తారు.

లాంచింగ్ సంద‌ర్బంగా ఈ ఫోన్‌పై ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.3000 వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అమెజాన్ కూప‌న్ల‌తో రూ.2000 డిస్కౌంట్ ఇస్తారు. 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment