Puneeth Rajkumar : పునీత్ స‌మాధి ద‌గ్గ‌ర క‌న్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య‌..!

November 5, 2021 9:01 PM

Puneeth Rajkumar : పునీత్ మ‌ర‌ణించి అప్పుడే వారం రోజులు అవుతోంది. ఆయ‌న మ‌ర‌ణాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. పునీత్ మ‌ర‌ణ వార్త విన్న కొంద‌రు అభిమానులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోగా, ఇంకొంద‌రు గుండెపోటుతో మ‌ర‌ణించారు. రీసెంట్‌గా కోడిపాళ్యకు చెందిన భరత్‌(30) మంగళవారం ఉరివేసుకుని ‘అప్పుని’ కలవడానికి వెళుతున్నాను.. అంటూ రక్తంతో సూసైడ్‌ నోట్‌ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు.

hero suriya cried at Puneeth Rajkumar grave

పునీత్ మ‌రణాన్ని ఎవ‌రూ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఆయ‌న త‌న సేవా కార్య‌క్ర‌మాల‌తో అంద‌రి మ‌న‌సుల‌లోనూ చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. పునీత్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో టాలీవుడ్‌కి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. ఆ స‌మ‌యంలో రాలేక‌పోయిన‌ న‌టుడు సూర్య‌.. తాజాగా పునీత్ స‌మాధి ద‌గ్గ‌ర పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆయ‌న లేడ‌ని తెలిసి క‌న్నీరుమున్నీరుగా విలపించారు.

ఇటీవ‌ల పునీత్ మృతిపై త‌మిళ హీరోలు ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ని ఓ వ్య‌క్తి విజ‌య్ సేతుప‌తిపై దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సూర్య సంద‌ర్శించ‌డం ఆస‌క్తికరంగా మారింది. కాగా.. ఇటీవలే హీరో నాగార్జున, రామ్ చరణ్ లు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పునీత్ లేని లోటు పూడ్చలేనిదంటూ నాగార్జున, రామ్ చరణ్ అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now