Shruti Haasan : బాల‌య్య పక్క‌న శృతి హాస‌నా..? ఇదెక్క‌డి కాంబినేష‌న్ రా బాబూ..?

November 4, 2021 10:40 PM

Shruti Haasan : ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ సినిమాలో న‌టించిన శృతి హాస‌న్‌కు బాల‌కృష్ణ ప‌క్క‌న న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని గ‌త కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. క్రాక్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఒత్తిడి మేర‌కే శృతి హాస‌న్ బాల‌య్య ప‌క్క‌న న‌టించేందుకు ఒప్పుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ముందుగా ఆమె బాల‌య్య ప‌క్క‌న న‌టించేందుకు అంగీక‌రించ‌లేద‌ట‌. కానీ గోపీచంద్ మ‌లినేని చొర‌వ వల్ల ఆమె బాల‌య్య సినిమాకు ఓకే చెప్పింద‌ట‌. అయితే ఈ వార్త‌లు నిజ‌మే అయ్యాయి.

Shruti Haasan to act with balakrishna in his next movie

బాల‌కృష్ణ ఎన్‌బీకే 107 ప్రాజెక్టులో శృతి హాస‌న్ న‌టిస్తుందంటూ మైత్రి మూవీ మేక‌ర్స్ దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌క‌ట‌న చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. బాల‌య్య స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టించ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో చిత్ర యూనిట్‌ను, శృతి హాస‌న్‌ను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో బాల‌య్య స‌ర‌స‌న శృతి హాస‌న్ ఏ పాత్ర‌లో న‌టిస్తుంది ? కొంప‌దీసి బాల‌య్య‌కు కూతురుగా న‌టించ‌డం లేదు క‌దా.. ఇదేమి దిక్కుమాలిన కాంబినేష‌న్ రా బాబూ.. అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆమెను హీరోయిన్‌గా అనౌన్స్ చేసిన వెంట‌నే ఈ విధంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. మ‌రి సినిమా తీశాక అభిమానుల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

బాల‌య్య స్వ‌త‌హాగా కోపంగానే ఉంటారు, క‌నుక ఆయ‌న ప‌క్క‌న చేసేందుకు శృతి మొద‌ట భ‌య‌ప‌డింద‌ట‌. కానీ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని స‌ర్దిచెప్ప‌డంతో ఆమె న‌టించేందుకు ఒప్పుకుంద‌ట‌. ఏది ఏమైనా.. బాల‌య్య ప‌క్క‌న శృతి హాస‌న్ అంటే.. ఇది వెరైటీ కాంబినేష‌న్ అని కొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు. మ‌రి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment