మీ కాళ్లు మొక్కుతా.. నన్ను బతికించండి అంటూ మహిళ ఆవేదన.. చివరికి!

April 27, 2021 8:09 PM

ప్రస్తుతం మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా రోగుల అర్థ నాదాలు వినిపిస్తున్నాయి. స్మశాన వాటికలలో మృతుల అంత్యక్రియల మంటలు చల్లారడం లేదు. ఈ రెండవ దశ కరోనా వైరస్ తో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

తాజాగా తెలంగాణలో నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండలం బాదన్‌కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత (40) కరోనా బారిన పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమె నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. సరైన వైద్యం అందక పోవడంతో ఆ మహిళ ఆవేదన వర్ణనాతీతం. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.. మీ కాళ్లు మొక్కుతా నాకు చిన్న పిల్లలు ఉన్నారు సరైన వైద్యం కోసం నన్ను వేరే ఆసుపత్రికి పంపించండి అంటూ ఆ మహిళ చేసిన ఆర్తనాదాలు ఎంతోమందిని కలచివేశాయి.

శాంతా పరిస్థితి మరింత తీవ్రం కావడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియాలో శాంతా వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచి వేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment