Puneeth Rajkumar : అప్పు చివ‌రి క్ష‌ణాలు.. వైర‌ల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్..

November 3, 2021 1:51 PM

Puneeth Rajkumar : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా మ‌నంద‌రినీ వ‌దిలి వెళ్లిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయమం చేస్తున్న సమయంలో పునీత్‏కు ఛాతిలో నొప్పి వచ్చిందని, ఆ వెంట‌నే ఫ్యామిలీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లగా, ఆయ‌న గుండెలో మార్పులు గ‌మనించి వెంటనే విక్రమ్ ఆసుపత్రికి సమాచారం అందించారు.

Puneeth Rajkumar last minuets cctv footage viral video

విక్ర‌మ్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారని ఇప్పటికే డాక్టర్స్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఛాతిలో నొప్పి వ‌చ్చిన‌ప్పుడు ఆసుప‌త్రికి వెళ్లేందుకు పునీత్.. వారి ఇంటి నుంచి కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ఎక్కినట్లుగా కనిపిస్తోంది. తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో చెప్పారు.

కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారు.. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్ను మూశారు. పునీత్ చివరి క్షణాలకు సంబంధించిన విజువల్స్ చూస్తే కళ్లు చెమ్మగిళ్లక మానవు. పునీత్ మృతితో యావ‌త్ దేశం శోక‌సంద్రంలో మునిగిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now