Raja Vikramarka : రాజా విక్ర‌మార్క ట్రైల‌ర్.. కామెడీతోపాటు యాక్ష‌న్ అదిరిపోయిందిగా..!

November 2, 2021 10:36 AM

Raja Vikramarka : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో కార్తికేయ‌. తొలి చిత్రంతో అద‌ర‌గొట్టిన కార్తికేయ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేశాడు. కానీ ఏ చిత్రం కూడా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు. చివ‌రిగా చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన తదుపరి చిత్రాలను ఎంచుకోవడంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.

Raja Vikramarka trailer action and comedy entertainer

`రాజా విక్రమార్క` చిత్రం ఓ డిఫరెంట్‌ అండ్‌ పవర్‌ ఫుల్‌ కథాంశంతో రూపొందింది. దీపావళి కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కాగా, కామెడీ, డ్రామా, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కచ్చితంగా కార్తికేయ హిట్‌ కొట్టబోతున్నాడనే సంకేతాన్నిస్తుంది. నాని చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ట్రైలర్ చూస్తే కార్తికేయ భద్రతా దశాల అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

హోం మంత్రికి ముప్పు అంటే బాధ్యత నాది.. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి.. అంటూ సుధాకర్ కోమాకుల చెప్తున్న డైలాగ్స్ ఆసక్తిని కలిగించగా.. తనికెళ్ల భరణి.. కార్తికేయ మధ్య జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now