Bigg Boss 5 : పాంత్రీయ విద్వేషానికి దారి తీసిన.. సన్నీ, అనీ మాస్టర్ ల గొడవ..

October 31, 2021 10:50 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 లో రోజురోజుకీ ఎపిసోడ్స్ పీక్స్ కి చేరుతున్నాయి. లేటెస్ట్ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం మాములుగా లేదు. కెప్టెన్సీ టాస్క్ లో పర్సనల్ గా కూడా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా సన్నీ, అనీ మాస్టర్ ల గొడవ మామూలుగా లేదు. ఇంటి సభ్యులకు పూరీలు చేసే టాస్క్ లో భాగంగా రెండు టీమ్స్ గా విడిపోయారు. అనీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబోలు ఒక టీమ్. మిగిలిన కంటెస్టెంట్స్ సెకండ్ టీమ్. ఇందులో కాజల్ టీమ్ 50 చపాతీలను ఫినిష్ చేశారు. అయితే అవి సరిగ్గా లేవని, అనీ మాస్టర్ టీమ్ ను షన్నూ విన్నర్ గా ప్రకటించాడు.

Bigg Boss 5 sunny and ani master quarrel controversy

దీంతో సన్నీ జైలు నుండే ఒకసారి రూల్స్ బుక్ చూడమని, షణ్ముఖ్ కి సలహా ఇస్తాడు. అంతే అనీ మాస్టర్ ఒక్కసారిగా సన్నీపై విరుచుకుపడింది. నీకు నీ ఫ్రెండ్స్ కష్టం తప్ప మిగతావాళ్ళ కష్టం కనిపించదా అంటూ రెచ్చిపోయింది. మాటా మాటా పెరిగి.. మీరు సౌత్.. నార్త్ అంటూ ప్రాంతీయత గురించి గొడవ పడేలా మారింది. వీరిద్దరూ ఇలా తిట్టుకుంటుంటే.. కెప్టెన్ షణ్ముఖ్‌ ఓ పక్కన కూర్చుని గొడవను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది గమనించిన సన్నీ.. షణ్ముఖ్ తో వాదించాడు.

హా ఏంటిప్పుడు నాకు నవ్వొచ్చింది నవ్వాను.. కొడతావా అంటూ సన్నీని రెచ్చగొడతాడు. అలా వీళ్ళ ముగ్గురి మధ్య మాటలు ఓ స్థాయికి చేరుకున్నాయి. నెక్ట్స్ వీకెండ్ స్పెషల్ లో నాగార్జున ఎంట్రీతో.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు. రవి చేసిన పనికి చీవాట్లు తిన్నాడు. నీ కోసం రూల్స్ మార్చలేమని, నువ్వు ఇక్కడికి డబ్బులు కోసం రాలేదని అన్నావ్.. ఇప్పుడే గేట్స్పె ఓపెన్ చేయిస్తా బయటకు వెళ్ళిపో అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు. నెక్ట్స్ అనీ మాస్టర్ గివ్ అప్ ఇవ్వడంపై కూడా ప్రశ్నించారు. సన్నీ ఫోటోను చింపేసి మరీ జైలుకు వెళ్ళాక కూడా నీలో మార్పు లేదని ఫైర్ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment