Tollywood : లేటెస్ట్ సినిమాల రిలీజ్ లతో హీట్ ఎక్కనున్న నవంబర్..!

October 31, 2021 10:14 AM

Tollywood : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ ఏడాది స్టార్టింగ్ నుండి వరుస సినిమాలను ఛాన్స్ చూసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు. రవితేజ్ హీరోగా క్రాక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ప్రజంట్ రవితేజ్ ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఫుల్ బిజీ అయ్యారు. అలాగే రాజకీయాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ కూడా ఒకే ఏడాదిలో రెండు సినిమాల్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tollywood is very busy in november and december with movies

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ్వులు పూయించారు. రీసెంట్ గా రాజరాజ చోర, లవ్ స్టోరీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాదిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో స్టార్ హీరోలవే ఎక్కువగా ఉన్నాయి. నవంబర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాతే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి ఒకే సమయానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేష్, హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. అలాగే శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మీనా, కుష్భూ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నెక్ట్స్ నవంబర్ 4 న మంచిరోజులు వచ్చాయి అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ లు జంటగా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక నవంబర్ 12న కార్తికేయ హీరోగా యాక్ట్ చేసిన రాజా విక్రమార్క రాబోతుంది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ గా నటించనున్నారు. నాగశౌర్య నటించిన లక్ష్య సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో నాగ శౌర్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలతోపాటు అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న రౌడీబాయ్స్, రామ్ అసుర్, గుడ్ లక్ సఖి, స్కైలాబ్ సినిమాలను నవంబర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో రానున్న రెండు నెలల్లో సినీ ప్రేక్షకులకు బోలెడంత వినోదం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now