Aryan Khan : వామ్మో.. ఆర్యన్ బెయిల్ కోసం షారూఖ్‌ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారా ?

October 30, 2021 11:22 PM

Aryan Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3వ తేదీన ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసి గత నాలుగు వారాల నుంచి వారి కస్టడీలోనే ఉంచుకున్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ రూ.కోట్లలోనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

shahrukh khan spent about crores of rupees for Aryan Khan release

ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఎంతో ప్రసిద్ధి చెందిన న్యాయవాదులను రంగంలోకి దించారు. దేశంలోనే ఎంతో పేరుగాంచిన ముగ్గురు న్యాయవాదులను నియమించారు. వారిలో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సతీష్ మనీష్ షిండే, అమిత్ దేశాయ్ లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం శ్రమించారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు లాయర్లకు రోజుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినట్లు సమాచారం.

మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి రోజుకు రూ.30 లక్షలు ఫీజు చెల్లించినట్లు సమాచారం. సతీష్ మనీష్ షిండేకు రోజుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు, అమిత్ దేశాయ్ కి రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.26 లక్షల ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఇన్ని లక్షల రూపాయల మొత్తంలో షారుక్ ఖాన్ తన కొడుకు కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now