Anupama Parameshwaran : అర్జున్ రెడ్డిని తలపించే కిస్సింగ్ సీన్స్ తో సిద్ధం అవుతున్న అనుపమ పరమేశ్వరన్..!

October 30, 2021 11:51 AM

Anupama Parameshwaran : మలయాళ క్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన కర్లీ హెయిర్ తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. అలాగే అభినయానికి పెద్దపీట వేసి గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది. షార్ట్స్ వేయడం, ఎక్స్ పోజింగ్ కి మోహమాటం లేకుండా స్ట్రిక్ట్ గా నో చెబుతోంది. కానీ ఇప్పుడు ఈమె తన స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవ్వడం లేదనే విషయం ఖరారవుతోంది. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రానున్న 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు కార్తికేయ 2లో కూడా యాక్ట్ చేస్తోంది.

Anupama Parameshwaran readying for any type of scenes in her upcoming movies

ఇక నెక్ట్స్ రౌడీ బాయ్స్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఆమె లుక్, స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. దీంతో ఈ మూవీ నుండి రిలీజ్ అయ్యే పోస్టర్లపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మేనల్లుడు ఆశిష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ తన గ్లామర్ షోతోపాటు లిప్ లాక్ సీక్వెన్స్ ని కూడా చేయబోతుందట. ఇక ఈ సీన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది. ఈసారి థియేటర్స్ షేక్ అవ్వాల్సిందేనంటూ ఈ సినిమా దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు.

రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కెరీర్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె సెక్సీ లుక్ తోపాటు కిస్సింగ్ సీన్స్ తో యూత్ కి మహారాణిగా మారుతుందా అనే రేంజ్ లో పాపులర్ అవుతుందని అనుకుంటున్నారు.

ఈ సినిమా టీజర్ తో ఇప్పటికే ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక అనుపమ, ఆశిష్ ల కిస్సింగ్ సీన్స్ తోపాటు ఆమె గ్లామర్ లుక్ తో రిలీజ్ అయ్యే ట్రైలర్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ హర్ష కొంగువంటి ఈ మూవీకి డైరెక్షన్ వహిస్తున్నారు. రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ డేట్ ను అతి త్వరలో ప్రకటించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment