Puneeth Rajkumar : ఎన్‌టీఆర్‌ సినిమా ఫ్లాప్‌.. దాన్ని పునీత్‌ తీసి హిట్‌ కొట్టారు..

October 30, 2021 2:31 PM

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన సినిమాలలో మాత్రమే హీరోగా కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక హీరోగా కన్నడనాట పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పునీత్ కు తెలుగు పరిశ్రమతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉంది.

Puneeth Rajkumar remake ntr movie and got hit

ఈ క్రమంలోనే ఎన్టీఆర్, పునీత్ మధ్య మంచి స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడటం వల్ల వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎలాంటి నటనను కనబరుస్తారో కన్నడ పరిశ్రమలో పునీత్ అచ్చం అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తెలుగు హీరోలు నటించిన చాలా వరకు సినిమాలను పునీత్‌ రీమేక్ చేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తెలుగులో నటించి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఆంధ్రావాలా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాను కన్నడనాట పరిశ్రమలో పునీత్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కన్నడంలో మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఇక ఇంత గొప్ప స్టార్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ పూరీ జగన్నాథ్ కే దక్కిందని చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment