Sudha : నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తప్పు అదే.. నటి సుధ షాకింగ్ కామెంట్స్..

October 30, 2021 3:16 PM

Sudha : ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సుధ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను జీవితంలో ఎన్నో తప్పులు చేశానని అయితే వాటన్నింటిలో కెల్లా తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తప్పు ఒకటి చేశానని.. అసలు విషయం బయట పెట్టారు.

Sudha said she had done that mistake that she never forgets

ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో నటి సుధకు ఎంతో డిమాండ్ ఉండేది. ఈమెకు ఏమాత్రం కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈమె ఎన్నో సినిమాలను వదులుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య సినిమా కోసం ఈమెను 40 రోజుల కాల్షీట్స్ అడిగారు. అయితే ఆ సమయంలో పది రోజులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సుధ ఉన్నారు. ఇలా అప్పటికే పలు చిత్రాలతో ఎంతో బిజీగా ఉండి డేట్స్ లేనందువల్ల సుధ ఈ సినిమాను తిరస్కరించారు.

ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో అక్కడికి వచ్చిన రాఘవేంద్రరావు ఒకసారి వెళ్లి అన్నమయ్య సినిమా చూడు అని చెప్పారు. అలాగే వెళ్లి ఆ సినిమా చూస్తే ఎంతో బాధపడుతూ ఏడ్చానని ఇంత మంచి సినిమాను ఎలా వదులుకున్నాను.. అంటూ ఎంతో బాధపడ్డానని సుధ ఈ సందర్భంగా తెలిపారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు మరోసారి రాఘవేంద్ర రావు ఫోన్ చేసి శ్రీ రామదాసు చిత్రంలో తల్లి పాత్ర ఉంది ఇందులోనైనా నటిస్తావా లేదా అని అడుగగా.. తప్పకుండా చేస్తానని శ్రీ రామదాసు సినిమాలో నటించానని, అయితే అన్నమయ్య సినిమాను వదులుకోవడం తన జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అని.. ఈ సందర్భంగా సుధ వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment