Esha Gupta : ఇండస్ట్రీలో నిలబడాలంటే రూమ్ కి రావాలని చెప్పారు.. నటి ఈషా గుప్తా సంచలన వ్యాఖ్యలు..

October 30, 2021 12:27 PM

Esha Gupta : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు కష్టాలను ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలబడాలన్నా, అవకాశాలు రావాలన్నా తప్పకుండా కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుందని పలువురు వారు ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ కష్టాల గురించి తెలియజేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా తను ఈ విధమైన క్యాస్టింగ్ కౌచ్ కష్టాలను ఎదుర్కొంటున్నానని ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది.

Esha Gupta said about a producer on casting couch

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా గుప్తా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. తాను మొదట్లో ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలియజేసింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ కోసం అవుట్ డోర్ షూటింగ్ వెళ్లామని అక్కడ ఓ నిర్మాత ఎన్నో ఇబ్బందులు పెట్టాడని ఈషా తెలిపింది. ఆ నిర్మాతకు భయపడి మేకప్ ఆర్టిస్ట్ ని తన దగ్గర పడుకోమని చెప్పేదాన్ని అంటూ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.

ఇక మరో ఇద్దరు డైరెక్టర్లు తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తనని వారి రూమ్ కి రావాలని, వారి పక్కన పడుకోవాలని తెలిపారు. ఇలా కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొని  ధైర్యంగా నిలబడటంతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారికి ఎలాంటి బాధలు ఉండవు కానీ కొత్తగా బయటనుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ విధమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment