Manchu Vishnu : తన భార్యపై హాట్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!

October 28, 2021 10:11 PM

Manchu Vishnu : టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు రీసెంట్ గా మా ఎన్నికల్లో విజయం సాధించాడు. ఈ ఎలక్షన్స్ కోసం మంచు విష్ణు చాలా కష్టపడ్డాడు. ప్రచారం సమయంలోనూ, గెలిచిన తర్వాత ఇంటర్వ్యూల్లో సోషల్ మీడియాలో వాదనలు, గొడవలు వాటికి సంబంధించిన సమాధానాలు ఇలా ఎన్నో విషయాల్లో మంచు విష్ణు అలసిపోయాడు. ప్రకాష్ రాజ్ తో డైరెక్ట్ గా పోటీ పడి మరీ గెలిచారు. ఈ క్రమంలో ఎన్నో వాగ్వాదాలు నెలకొన్నాయి. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ తోపాటు మరికొంతమంది మంచు విష్ణు గెలుపుపై అనుమానాలతో నానా హంగామా చేశారు.

Manchu Vishnu comment on his wife viranica

ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ మెంబర్స్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కూడా సినీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల మధ్య నుండి కొన్ని రోజుల పాటు మంచు విష్ణు ఫ్యామిలీ టూర్ కి వెళ్ళారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మంచు విష్ణు తన భార్యతో కలిసి ఫ్లైట్ లో తీసుకున్న ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఓ కామెంట్ ని కూడా షేర్ చేశారు.

ఫైనల్ గా మా ఎన్నికల తర్వాత తన ఫ్యామిలీతో కలిసి హాయిగా సేదతీరేందుకు మంచు విష్ణు భార్య విరానికతో కలిసి టూర్ ప్లాన్ చేశారు. తనకు కొన్నాళ్ళ పాటు బ్రేక్ తీసుకోవడానికి ఓ మంచి కంపెనీ అంటూ ఆయన భార్య విరానికను చూపిస్తూ.. అవును తను హాట్.. కానీ ఎప్పుడూ ఫోన్ తోనే బిజీ అంటూ.. చెప్పాడు మంచు విష్ణు. ఈ పోస్ట్ ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంచు విష్ణు భార్య విరానిక, ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసకు చెల్లెలు అవుతుందనే విషయం తెలిసిందే. ఈ రిలేషన్ మీదే మా ఎన్నికల్లో వైసీపీ పాత్ర పోషించిందంటూ ఆరోపణలు వచ్చాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment