Bigg Boss 5 : ఈ వారం ఎలిమినేట్ అవ‌బోతున్నది ఎవ‌రు ? ఈయ‌నేనా ?

October 28, 2021 10:29 AM

Bigg Boss 5 : వారాలు గ‌డుస్తున్న‌కొద్దీ బుల్లితెర‌పై బిగ్‌బాస్ జోరు పెరుగుతోంది. మొద‌ట్లో పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని ప్రేక్ష‌కులు ఇప్పుడు ఈ షోను తెగ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వారాంతాల‌తోపాటు ఆపైన జ‌రిగే నామినేష‌న్ ఎపిసోడ్‌ల‌ను కూడా ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ షో 7 వారాలు పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగు పెట్టింది. అయితే ఈ వారం మొత్తం 6 మంది ఎలిమినేష‌న్ కోసం నామినేట్ అయ్యారు.

Bigg Boss 5 lobo may the one is going to be eliminated this week

కాగా యాంక‌ర్ ర‌వి వ‌రుస‌గా 8వ వారం కూడా నామినేట్ అయ్యాడు. కానీ ప్ర‌తి వారం సేవ్ అవుతూనే ఉన్నాడు. ఇక ఈ వారం కూడా ర‌వి నామినేష‌న్స్‌లో నిలిచాడు. కానీ ర‌వి ఈ వారం కూడా సేవ్ అవుతాడ‌ని తెలుస్తోంది. ర‌వికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కార‌ణంగా అత‌ను సేవ్ అవుతాడ‌ని భావిస్తున్నారు.

ఇక ర‌వి కాకుండా జ‌శ్వంత్‌, లోబో, సిరి, శ్రీ‌రామ్‌, మాన‌స్‌లు నామినేష‌న్‌లో నిలిచారు. ఓట్ల ప‌రంగా చూస్తే ష‌ణ్ముఖ్‌, ర‌వి అంద‌రిక‌న్నా ముందే ఉన్నారు. వీరికి ఓట్లు కూడా ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. వీరితోపాటు శ్రీ‌రామ్‌, మాన‌స్‌లు కూడా ఈ వారం సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా ? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌లుగురు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ప్ప‌టికీ వారిలో లోబో, సిరి ఇద్ద‌రు మాత్ర‌మే ప్ర‌త్యేక డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా లోబోకే ఇంకా డేంజ‌ర్ ఎక్కువగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అత‌ను ఈ వారం ఎలిమినేట్ అవుతాడ‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎలిమినేట్ అయిన వారిలో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. దీంతో ఈసారి మ‌గ‌వారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే.. లోబో క‌చ్చితంగా నిష్క్ర‌మించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ మాత్ర‌మే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌గ కంటెస్టెంట్ల‌లో ఒక‌రిగా ఉన్నారు. దీంతో ఈసారి మ‌రో మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడ‌ని తెలుస్తోంది. అదే నిజం అయితే లోబో క‌చ్చితంగా ఎలిమినేట్ అవుతాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈ విష‌యం తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment