T20 World Cup 2021 : స్కాట్లండ్‌పై విజ‌యం సాధించిన నమీబియా..!

October 27, 2021 11:07 PM

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 21వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై న‌మీబియా విజ‌యం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని న‌మీబియా త‌డ‌బ‌డుతూ ఛేదించింది. ఈ క్ర‌మంలో స్కాట్లండ్‌పై న‌మీబియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 namibia won by 4 wickets against scotland in 21st match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన న‌మీబియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా స్కాట్లండ్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో స్కాట్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్ల‌లో మైకేల్ లియాస్క్ 44 ప‌రుగులతో ఆక‌ట్టుకున్నాడు. 27 బంతులు ఆడిన మైకేల్ 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. అలాగే క్రిస్ గ్రీవ్స్ 32 బంతుల్లో 2 ఫోర్ల‌తో 25 ప‌రుగులు చేశాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. న‌మీబియా బౌల‌ర్ల‌లో రూబెన్ ట్రంపెల్‌మ‌న్ 3 వికెట్లు తీయ‌గా, జాన్ ఫ్రైలింక్ 2 వికెట్లు తీశాడు. జేజే స్మిట్‌, డేవిడ్ వెయెసెల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన న‌మీబియా 19.1 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల‌ను కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. న‌మీబియా బ్యాట్స్‌మెన్‌ల‌లో జేజే స్మిట్ 32 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. 23 బంతులు ఆడిన స్మిట్ 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు కొట్టాడు. క్రెయిగ్ విలియ‌మ్స్ అనే మ‌రో బ్యాట్స్‌మ‌న్ 23 ప‌రుగులు చేయ‌గా.. అందులో 1 సిక్స్ ఉంది. స్కాట్లండ్ బౌల‌ర్ల‌లో మైకేల్ లియాస్క్ 2 వికెట్లు తీశాడు. బ్రాడ్ వియ‌ల్‌, స‌ఫ్‌యాన్ ష‌రీఫ్‌, క్రిస్ గ్రీవ్స్‌, మార్క్ వాట్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment