Bigg Boss 5 : బిగ్ బాస్‌కి ఆడవాళ్లు న‌చ్చ‌డం లేదా.. ఇలా అయితే ఎలా బిగ్ బాస్ ?

October 26, 2021 1:38 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోలో సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ ర‌చ్చ షురూ అవుతుంది. ఈ సమయంలో కొంద‌రు సరైన కారణాలు చెప్తుంటే.. మరికొందరు మాత్రం మనసులో ఉన్న విషయాలను గుర్తు పెట్టుకుని నామినేషన్స్ సమయంలో వాటిని బయటికి తీసుకొస్తున్నారు. ఏదేమైనా నామినేష‌న్ ర‌చ్చ చాలా హాట్ హాట్‌గా జ‌రుగుతూ వ‌స్తోంది.

Bigg Boss 5 not liking lady contestants what is this

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో 12 మంది సభ్యులున్నారు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి 6 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే ఈ షో నుండి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా అందులో ఆరుగురు లేడీ కంటెస్టెంట్స్ ఉన్నారు. లహరి, హమీదా, ఉమాదేవి, శ్వేత వర్మ, సరయు.. ప్రియా. లేడీస్ అంద‌రూ ఇలా వెళ్లిపోతుండ‌డంతో షోకి గ్లామ‌ర్ తగ్గుతుంద‌ని కొంద‌రు బాధ‌ప‌డుతుంటే, మ‌రి కొంద‌రు బిగ్ బాస్ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్లు కాజల్, అనీ మాస్టర్‌, సిరి, ప్రియాంక సింగ్ మాత్రమే. వారిని కూడా బిగ్ బాస్ త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు పంపిస్తారా. మ‌గ‌వాళ్ల‌నే విజేత‌లుగా ప్ర‌క‌టిస్తారా.. అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. గత 4 సీజన్లలోనూ అబ్బాయిలే విజేతలు అయ్యారు. ఆడవాళ్ళని విజేతలు కానివ్వరా.. అంటూ చాలా మంది మహిళలు మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయితే నెటిజ‌న్స్ నిర్వాహ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌క్కా అని అనిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment