Prabhas Pooja Hegde : పూజా – ప్ర‌భాస్‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ నిజ‌మేనా.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది..?

October 26, 2021 10:18 AM

Prabhas Pooja Hegde : టాలీవుడ్‌కి గోల్డెన్ గర్ల్‌గా మారిన పూజా హెగ్డే రీసెంట్‌గా ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్రేర‌ణ పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌ల‌లో ప్ర‌భాస్‌తో పూజా చాలా రొమాన్స్‌ని పండించిన‌ట్టుగా తెలిసింది. అయితే రాధేశ్వామ్ సినిమా షూట్ చివరి రెండు నెలలు హీరో హీరోయిన్లు ప్రభాస్-పూజా అస్స‌లు మాట్లాడుకోలేద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

Prabhas Pooja Hegde what happened between them

ఇద్ద‌రి మ‌ధ్య సీన్స్ కూడా విడివిడిగా గ్రీన్ మ్యాట్‌లో చిత్రీక‌రించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఖండించిన విష‌యం తెలిసిందే. అయితే యూవీ సంస్థ ఏం జ‌ర‌గ‌లేదు అని చెప్పినా, ఇద్ద‌రి మ‌ధ్య ఏదో అయింద‌నే వార్త‌లు మాత్రం సోష‌ల్ మీడియాలోహ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే అస‌లు రీజ‌న్ ఏంట‌నే విష‌యం ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు రాలేదు.

విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఓ రోజు అంతా చెప్పాపెట్టకుండా పూజా షూటింగ్ ఎగ్గొట్టేసినట్లు, ప్రభాస్ సెట్ లో అలా వెయిటింగ్ లో ఉండి పోయినట్లు తెలుస్తోంది. పూజా ప్ర‌వ‌ర్త‌నకి విసిగిపోయిన ప్రభాస్ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఆస‌క్తి చూప‌లేద‌ని స‌మాచారం. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల కాగా ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 14న రాబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment