Tollywood : ఆ హీరోయిన్ అంటే.. నిర్మాతలకు కూడా భయమే!

October 25, 2021 12:22 PM

Tollywood : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల హవా ఓ రేంజ్ లో ఉంటుంది. వారికున్న హడావిడి, డిమాండ్ ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కి మాత్రం నిర్మాతలు సైతం భయపడుతున్నారు. దర్శకుల పరిస్థితైతే ఇక చెప్పక్కర్లేదు. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అస్సలు సినిమాలే లేవు. వేరే భాషలో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా టర్న్ అయ్యింది. తెలుగులో కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చాయి.

Tollywood producers are fearing about that heroine

ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ దర్శక నిర్మాతలకు ఓ రేంజ్ లో నక్షత్రాలను లెక్కపెట్టించింది. ఒక్కరోజు కూడా షూటింగ్ కోసం టైమ్ పాటించలేదు. ఇక షాట్ టైమ్ కి హాజరు కాక ఎన్నో సార్లు ప్యాకప్ చెప్పాల్సి వచ్చిందట. ఇక ఆమె నటించిన సినిమాలను నానా కష్టాలు పడి పూర్తి చేశారు. ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కి కనుక ఈ హీరోయిన్ రావాలంటే.. తనకు ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్‌ చేయాలని కండిషన్ పెట్టిందట.

ఉన్న ఊర్లోనే ఫంక్షన్ జరుగుతుంటే ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ ఎందుకు ? అంటూ.. తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఆ ప్రశ్నకు.. ఆమె ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళి ఫంక్షన్ కోసం డ్రెస్, మేకప్ వేసుకుని వస్తుందట. ఆ కారణం తెలిశాక నిర్మాతలకు షాక్. అంటే ఆమె ఇంటి నుండి డైరెక్ట్ గా పార్టీ డ్రెస్ తో ఫంక్షన్ కు రారట. ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ లో కేవలం రెండు గంటల పని కోసం అలా నిర్మాతలతో వేల రూపాయల్ని ఖర్చు చేసిన ఘనత ఆమెకే దక్కింది. ఈ విషయం తెలిసిన వారంతా.. మేడమ్ సార్.. మేడమ్.. అంతే.. అనుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now