Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్‌ని అప్పుడే డిసైడ్ చేసేశారా…!

October 24, 2021 2:32 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోపై చాలా మంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయం అయిన ఈ షో ఇక్కడి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అవడంతోపాటు నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవ‌ల ఐదో సీజన్ ప్రారంభం కాగా, ఈ షోకి సంబంధించి వ‌స్తున్న లీకులు అభిమానుల‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

Bigg Boss 5 season winner is declared may be he is the winner

నామినేష‌న్స్‌లో ఉన్న వారెవ‌రు, ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు, వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ ఎవ‌రు, కెప్టెన్ ఎవ‌రు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవ‌రు, ఇలాంటి విష‌యాల‌న్నీ నెటిజ‌న్స్‌కి ముందుగానే తెలిసిపోతున్నాయి. అయితే ఇప్పుడు సీజ‌న్ 5 విన్న‌ర్ ఎవ‌రు అనే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయినపుడు విన్న‌ర్ రేసులో చాలా మంది ఉన్నారు. విశ్వ, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్.. ఇలా అందరూ టైటిల్ రేసులో పోటీ ప‌డ్డారు.

కానీ గత కొన్ని వారాలుగా నామినేషన్స్ లోకి వస్తున్న షణ్ముఖ్‌ ఓటింగ్ చూస్తుంటే ఇతడే ఈ సీజన్ విన్నర్ అవుతాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గేమ్ స‌రిగ్గా ఆడ‌కుండా ఏదో టైంపాస్ చేస్తున్న ష‌ణ్ముఖ్ త‌న ఫాలోయింగ్‌తోనే నెట్టుకొస్తున్నాడు. టైటిల్ విన్న‌ర్ అత‌డే అవుతాడ‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. షణ్ముఖ్‌ కి రానున్న రోజుల‌లో సన్నీ , మానస్, శ్రీరామ్ ట‌ఫ్ ఫైట్ ఇస్తార‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now