Gully Rowdy : ఓటీటీలో సందడి చేయబోతున్న గల్లీ రౌడీ.. ఎప్పటి నుంచంటే?

October 24, 2021 8:57 PM

Gully Rowdy : జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంస్థ నిర్మించిన చిత్రం “గల్లీ రౌడీ”. కరోనా రెండవ దశ తర్వాత థియేటర్లలో విడుదల అయి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసింది.

Gully Rowdy movie to stream on hotstar from diwali

తాజాగా ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ యాప్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లలో మంచి టాక్ సంపాదించుకుంది ఈ చిత్రం. డిజిటల్ మీడియాలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో రౌడీ కొడుకుగా పుట్టిన సందీప్ కిషన్ ను రౌడీ గానే తయారుచేయాలని తన తాత ప్రయత్నిస్తే తాను మాత్రం హీరోయిన్ ప్రేమలో పడతాడు.

ఇలా హీరోయిన్ ప్రేమలో ఉన్న హీరో ఏ విధంగా గల్లి రౌడీ గా మారాడు, రౌడీయిజం ఇష్టంలేని హీరో ఎలా రౌడీగా మారి తన తాత కోరికను నెరవేర్చాడు.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, హర్ష, వెన్నెల కిషోర్, బాబీ సింహా మొదలైనవారు కీలక పాత్రలలో నటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment