తన ప్రేమను తమ్ముడు వ్యతిరేకిస్తున్నాడని.. తల మొండెం వేరు చేయించిన నటి!

ఏప్రిల్ 25, 2021 12:24 ఉద.

కర్ణాటకలోని ఈనెల 12వ తేదీ జరిగిన దారుణమైన హత్య వెనుక ఓ నటి ప్రమేయం ఉందని దర్యాప్తులో వెలుగుచూసింది.తను ప్రేమను తరచూ తన తమ్ముడు వ్యతిరేకిస్తున్నాడనే కోపంతో తన ప్రియుడితో కలిసి ఏకంగా తన తమ్ముడిని చంపడానికి పథకం వేసింది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకుందాం..

శాండల్ ఉడ్ లో అప్ కమింగ్ ఆర్టిస్ట్ షయన కాట్వే, నియాజ్ అనే వ్యక్తితో  ప్రేమలో పడింది. తన ప్రేమను తరచూ తన తమ్ముడు వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలోనే నియాజ్ తన ప్రేమకు అడ్డుగా ఉన్న తన తమ్ముడు రాకేష్ ను చంపుతానని షయన  వద్ద ప్రస్తావించాడు. అందుకు ఆమె అంగీకరించి,నిజమే ఆ పని చేస్తే మన ప్రేమకు ఇకపై ఎవరూ అడ్డు ఉండదని ఆమె చెప్పడంతో నియాజ్ సరైన సమయం కోసం వేచి చూశాడు.

హబ్బళ్లి నగర శివారులోని దేవరహళ్లి లోని కంప చెట్లు, వ్యర్ధాలు పడేసే దిబ్బల దగ్గర తలకాయ లేని గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. పోలీసులు తలలేని మొండెం చూసి, ఆశ్చర్యపోయి ఆ శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే నగరంలో మరో ప్రాంతంలో మొండెం లేని తల కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ రెండింటిని అతికించారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితమే రాజేష్ పై మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే రాజేష్ ను హత్య చేసిన నియాజ్ అతని మిత్రులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment