బంగారం అనగానే మైమరిచిపోయిన మహిళ.. ఆమె కక్కుర్తి విలువ కోట్లలో!

April 25, 2021 12:19 AM

భారత దేశంలోని మహిళలకు బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం ఎంత ఉన్నా ఇంకా కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఫ్రీగా వస్తుంది అంటే ఏ మహిళ వదులుకోదు. అచ్చం అదే రీతిలోనే ఎంతో సంపన్నురాలైన ఓ మహిళ బంగారు నగలు ఉచితంగా వస్తున్నాయంటే కక్కుర్తిపడి కోట్లలో మోసపోయింది. చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూణేలోని  ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అవతలి వ్యక్తి ఆమెకు ఒక డాక్టర్ గా పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకొని అప్పుడప్పుడు చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలోనే అవతల వ్యక్తి ఆమెకు బంగారు నగలను పంపిస్తున్నా అంటూ ఫోన్ చేసి చెప్పాడు.

సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆమెకు కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఉచితంగా వచ్చే నగలకు కక్కుర్తి పడింది. ఆ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ విమానాశ్రయానికి నగలు వచ్చాయని, వాటిని తీసుకోవడం కోసం కష్టమ్ చార్జీలు భరించాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె అతని ఖాతాకు డబ్బులు పంపింది. మరికొందరు కస్టమ్స్ అధికారుల మంటూ టాక్స్ కడితేనే ఆ నగలు ఇస్తామని ఫోన్లు చేయడంతో వారికి కూడా డబ్బులు చెల్లించింది.

ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అధికారుల మంటూ తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. మీకు ఇంత విలువైన నగలు ఎక్కడినుంచి వచ్చాయి,డబ్బులు పంపించకపోతే మీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఆ మహిళ మొత్తం 67 ఖాతాల్లో సుమారు 3.9 కోట్లు జమ చేసింది. 25 బ్యాంకులకు చెందిన ఖాతాలకు 207 ట్రాన్సాక్షన్స్ చేసింది. అయినా ఫోన్ వేధింపులు తగ్గక పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment