Heroines : హీరోయిన్స్‌లో ఈ విష‌యం గ‌మ‌నించారా.. బ్రేక‌ప్ త‌ర్వాత భ‌లే ఆఫ‌ర్స్..!

October 22, 2021 10:15 PM

these Heroines are getting offers after they break up

Heroines : ఒక‌ప్పుడు హీరోయిన్స్ పెళ్లైతే సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేవారు. ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపేవారు. ఇప్పుడ‌లా కాదు, పెళ్లైన త‌ర్వాత కూడా సినిమాలు చేస్తామంటున్నారు. సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌లో ఏవైనా మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తితే వెంట‌నే బ్రేక‌ప్ అనేస్తున్నారు. ఆ త‌ర్వాత క‌థ మళ్లీ మొద‌టికే. గ‌తంలో మాదిరిగా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇటీవ‌ల చైతూ నుండి విడాకులు తీసుకున్న స‌మంత జోరు పెంచింది.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు త‌మిళ చిత్రంలోనూ న‌టిస్తోంది. రీసెంట్‌గా స‌మంత సినిమాల‌కు సంబంధించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాతోపాటు మరో సినిమాకు సమంత సంతకం చేసింది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్స్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్‌ సినిమాలు చేస్తోంది.

బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆ సినిమా కోసం సమంత ఏకంగా 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది. పెళ్ల‌య్యాక వ‌రుస సినిమాలు చేస్తున్న స‌మంత రానున్న రోజుల‌లో మ‌రింత బిజీ కానుంది. ఇక భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ రిలేషన్‌ కట్‌ చేసుకున్నాక.. మెహ్రీన్‌ వరుస సినిమాలు ఓకే చేస్తూ వచ్చింది. కొంచెం వెన‌క్కు వెళితే ఏ.ఎల్‌. విజయ్‌తో వివాహ బంధం వద్దనుకున్నాక అమలా పాల్‌ కూడా ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగానే ఉంది. ఇలా పలువురు హీరోయిన్లు నిజానికి బ్రేకప్‌ చెప్పిన తరువాతే ఎక్కువ ఆఫర్లను పొందుతూ బిజీగా ఉండడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment