Aryan Khan : జైల్లో ఉన్న కొడుకుని క‌లిసిన షారూఖ్‌.. బాధ వ‌ర్ణ‌నాతీతం..

October 21, 2021 3:21 PM

Aryan Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు విష‌యంలో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ముంబై క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో అక్టోబర్ 2వ తేదీన అరెస్టు కాగా, అప్పటినుండి డ్రగ్స్ కేసుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బ‌య‌ట‌కు తీసుకు రావ‌డానికి షారూఖ్ నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

shahrukh khan met Aryan Khan in jail he cried

అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆర్యన్‌కి సంబంధించి పలుమార్లు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్‌ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగోసారి కూడా ఆర్య‌న్‌కు బెయిల్ రాక‌పోవ‌డంతో తనయుడిని చూసేందుకు షారుక్‌ ఆర్థర్‌ రోడ్డు జైలుకు వచ్చాడు. తండ్రిని చూసి ఆర్య‌న్ శోక‌సంద్రంలో మునిగిన‌ట్టు తెలుస్తోంది.

జైలు ఖైదీలతో కలిసి ఒకే బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ ఉంటున్నట్టు సోమవారం విడుదలైన శ్రవణ్ నాడార్ అనే వ్యక్తి చెప్పారు. 100 మంది ఖైదీలు ఉన్న బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ వాళ్లతో కలిసి ఉంటున్నట్టు వెల్లడించారు. కేవలం పది ఫ్యాన్లు, నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండే ఆ గదిలో ఉంటున్నారని చెప్పాడు. జైలు ఆహారాన్ని తీసుకోవడం లేదని, కేవలం బిస్కెట్లు, చిప్స్ మాత్రమే తింటున్నాడని, జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని ఇతర ఖైదీలకు ఇస్తున్నాడని వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now