త‌న‌కు న‌చ్చిన‌ట్లు భ‌ర్త‌ చొక్కా కుట్టించుకోలేద‌ని.. భార్య ఆత్మ‌హ‌త్య‌..

October 21, 2021 11:22 AM

ప్ర‌స్తుత త‌రుణంలో ఆత్మ‌హ‌త్య‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. కొంద‌రు దంప‌తులు చిన్న చిన్న త‌గ‌వుల‌కే తీవ్ర మ‌న‌స్థాపం చెంది.. ఆవేశంలో బ‌ల‌వంతంగా ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. రాజ‌స్థాన్‌లోని కోటా అనే ప్రాంతంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

woman suicide for husband not stitching shirt according to her interest

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన శుభ‌మ్ అనే వ్య‌క్తికి, రాజ‌స్థాన్‌లోని కోటా అనే ప్రాంతానికి చెందిన అంజ‌లి సుమ‌న్ అనే మ‌హిళ‌కు 2 ఏళ్ల కింద‌ట వివాహం అయింది. వీరు ఆర్‌కే పురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా శుభ‌మ్ ఓ చొక్కా కుట్టించుకున్నాడు. కానీ భార్య ఇష్టానికి అనుగుణంగా అత‌ను చొక్కా కుట్టించుకోలేదు.

దీంతో మ‌న‌స్థాపానికి గురైన అంజ‌లి భ‌ర్త‌తో గొడ‌వ పెట్టుకుంది. ఈ క్ర‌మంలో అత‌ను ఉద‌యం భోజ‌నం చేయ‌కుండానే ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లాడు. ఫోన్ లో అంజ‌లి భ‌ర్త‌తో ఇంటికి ర‌మ్మ‌ని చెప్పింది. కానీ అత‌ను ప‌నుంద‌ని, మ‌ధ్యాహ్నం వ‌స్తా.. అప్పుడు మాట్లాడుకుందాం.. అని చెప్పాడు. దీంతో మ‌రింత మ‌న‌స్థాపానికి గురైన అంజ‌లి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఇరుగు పొరుగు వారు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు న‌మోదు చేశారు. త‌మ బిడ్డ మృతికి శుభ‌మ్ కార‌ణ‌మ‌ని, అత‌న్ని అరెస్టు చేయాల‌ని అంజ‌లి త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment