Viral News : 6 ఏళ్ల బాలిక‌.. 24 నిమిషాల్లోనే 108 మంత్రాలు చ‌దివి రికార్డు సృష్టించింది..!

October 21, 2021 10:30 AM

Viral News : టాలెంట్ అనేది నిజంగా ఎవ‌రి సొత్తూ కాదు. కొంద‌రికి అది పుట్టుక‌తోనే వ‌స్తుంది. దానికి కాస్తంత మెరుగులు పెట్టాలే కానీ వారు అద్భుతాలు సృష్టిస్తారు. స‌రిగ్గా ఆ బాలిక కూడా అలాగే చేస్తోంది. నోరు తిర‌గ‌డానికి కూడా క‌ష్ట‌మైన వ‌య‌స్సులో ఏకంగా పెద్ద పెద్ద మంత్రాలు చ‌దివి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Viral News 6 year old girl chanting hard mantras

ఒడిశాలోని జ‌గత్‌సింగ్ పూర్ జిల్లాలో ఉన్న తారాడ‌పాడ గ్రామానికి చెందిన ర‌ష్మి ర‌జంన్ మిశ్రా కుమార్తె డి.సాయి శ్రేయాంసి వ‌య‌స్సు 6 ఏళ్లు. 1వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. కోవిడ్ నేప‌థ్యంలో ఆమె ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లోనే క్లాసుల‌కు హాజ‌ర‌వుతోంది. అయితే ఈ బాలిక ఎంతో క‌ష్ట‌మైన మంత్రాల‌ను అవ‌లీల‌గా ప‌ఠిస్తోంది.

తాజాగా ఈ బాలిక 24 నిమిషాల 50 సెక‌న్ల‌లో ఏకంగా 108 మంత్రాలు చ‌దివి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తాను రోజూ ఇంట్లో ప‌ఠించే మంత్రాల‌ను శ్ర‌ద్ధ‌గా విని నేర్చుకున్నాన‌ని ఆ బాలిక తెలియ‌జేసింది. అంతేకాదు.. ఆమెకు ఒడిస్సీ నృత్యం కూడా వ‌చ్చు. త్వ‌ర‌లోనే అందులోనూ పేరు తెచ్చుకుంటాన‌ని ఆ బాలిక చెబుతోంది. ఏది ఏమైనా.. ఇంత చిన్న వ‌య‌స్సులో అంత క‌ఠిన‌మైన మంత్రాల‌ను ప‌ఠిస్తుందంటే.. ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! కాగా ఈ బాలిక సాధించిన ఈ ఫీట్‌కు గాను ఈమె పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో న‌మోదు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment