Nayanthara : న‌య‌న‌తార‌కు పెళ్లి క‌ష్టాలు.. ఆ విధంగా చేస్తే త‌ప్ప ఇంకో మార్గం లేద‌ట‌..!

October 21, 2021 11:29 AM

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కెరీర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నా కూడా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం అనేక అవ‌రోధాలు ఎదుర్కొంటోంది. ప్ర‌భుదేవా, శింబుతో బ్రేక‌ప్ అయిన న‌య‌న‌తార గ‌త కొద్ది రోజులుగా విఘ్నేష్ శివ‌న్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతోంది. పెళ్లి చేసుకోవాలని ఆమె గత రెండేళ్లుగా చర్చలు జరుపుతోంది. మీడియా ఆ విషయంలో ఎప్పుడు ప్రశ్నించినా కూడా తమ జీవితం గురించి తమకు తెలుసునని చాలాసార్లు కౌంటర్ ఇచ్చింది.

Nayanthara  to marry trees to remove her jathaka dosham

ఈ సారైనా న‌య‌న్ ప్రేమాయ‌ణం విష‌యంలో ఎలాంటి అవ‌రోధాలు రాకుండా చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నయనతార పుట్టుక దోషాలతో ముడిపడి ఉందని.. ముందుగా ఆమె ఆ దోషాలకి తగ్గ పరిహారం చేసిన తర్వాత వివాహం చేసుకుంటే మంచిదని.. లేదంటే భర్తకు అన్నీ కష్టాలే ఉంటాయని కథనాలొస్తున్నాయి.

ఇప్ప‌టికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మ‌రి కొద్ది రోజులలో పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే అంత‌కుముందు అవసరమైన అన్ని ఘట్టాల్ని పూర్తిచేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ముందుగా విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవాలంటే అంతకంటే ముందే ఆమె ఓ చెట్టును వివాహం చేసుకోవాలట. అప్పుడే ఆ దోషం తొలగిపోతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో నయ‌న‌తార చెట్టుని వివాహం చేసుకొని ఆ త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లాడ‌నుంద‌ట‌. గతంలో ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకునే ముందు కూడా ఇలాగే చేశారు. ఆమె ఏకంగా మూడు చెట్లను వివాహం చేసుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment