Keerthy Suresh : యాంకర్ గా మారనున్న మహానటి.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

October 21, 2021 10:53 AM

Keerthy Suresh : వెండి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు ఆ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. చిరంజీవి మొదలుకొని బాలకృష్ణ, నాగార్జున, తారక్, సమంత, తమన్నా వంటి స్టార్ సెలబ్రెటీలు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Keerthy Suresh to become host for new television show

ఇక వీరి బాటలోనే మరోక హీరోయిన్ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుల్లి తెరపై ఓ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడం కోసం కీర్తి సురేష్ కార్యక్రమ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించనున్న కీర్తి సురేష్ కు నిర్వాహకులు రూ.15 లక్షల పారితోషికం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఆ కార్యక్రమానికి వచ్చే అతిథులతో కీర్తి సురేష్‌ గేమ్ ఆడించడమే కాకుండా వారిని ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేస్తుందని సమాచారం. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుంది.. ఏమిటి.. అనే విషయాల గురించి త్వరలోనే నిర్వాహకులు అధికారికంగా తెలియజేయనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ కార్యక్రమం నాలుగు భాషలలో ప్రసారం అవుతుందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment