Chiranjeevi Website : రామ్ చ‌రణ్ లాంచ్ చేసిన వెబ్‌సైట్‌లో త‌ప్పులు వ‌స్తున్నాయా..!

October 19, 2021 3:20 PM

Chiranjeevi Website : మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆద‌ర్శం. ఆయ‌న స్వ‌యంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు ఆయ‌న స్పూర్తితోనే ఎదిగారు. ఇప్పుడు చిరంజీవి గొప్ప‌త‌నాన్ని న‌లుగురికి తెలియ‌జేసేందుకు రామ్ చ‌ర‌ణ్ న‌డుం బిగించారు. సోమ‌వారం చిరంజీవి సినీ, వ్యక్తిగత జీవితవిశేషాలతో కూడిన www.kchiranjeevi.com అనే వెబ్‌సైట్‌ను రామ్‌చరణ్‌ ప్రారంభించారు. దీనితోపాటుగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలను విస్త్రతం చేస్తూ www.chiranjeevicharitabletrust.com అనే వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు.

Chiranjeevi Website getting mistakes fans not satisfied

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించిన వెంట‌నే వెబ్‌సైట్‌లో ఇన్‌ఫ‌ర్మేష‌న్ చూసేందుకు అభిమానులు ఆస‌క్తి చూపించారు. అయితే అందులో దొర్లుతున్న త‌ప్పులు ఫ్యాన్స్‌ని నిరాశ‌ప‌రుస్తున్నాయి. ఇంగ్లిష్‌ నుంచి ఇతర భాషల్లోకి టాన్సలేట్ చేసేందుకు ఆప్షన్ క్లిక్ చేయగానే అందులో ఉన్న సమాచారం మొత్తం అర్థరహితంగా డిస్‌ప్లే అవుతుంది. తెలుగులోనే ఇలా ఉంటే ఇతర భాషల పరిస్థితి ఏంటి ? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోమ‌వారం ప్రెస్‌మీట్‌కి హాజ‌రైన రామ్ చ‌రణ్ త‌న వ్య‌క్తిత్వంతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు. సెల్ఫీలు దిగకూడదని నిర్వాహకులు కాస్త హడావుడి చేసినా చరణ్ చొరవ తీసుకుని వాళ్లతో కలిసి ఫోటోలు దిగడంపై ఆసక్తి కనబరిచారు. మీడియా మిత్రులందర్నీ అన్నదమ్ముల్లా ట్రీట్ చేశారు. మిత్రులతో చరణ్ ఫోటోలు దిగి ఆశ్చర్యపరిచారు. అడిగిన వారికి సెల్ఫీలు సైతం ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now