వీడియో వైరల్: బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా?

April 23, 2021 8:09 PM

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో, ఆక్సిజన్ కొరతా తీవ్రస్థాయిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా బాధితులు సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో మన శరీరం కోల్పోయిన ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడం కోసం సింపుల్ పద్ధతులను చూపించాడు. బోర్లా పడుకొని చాతి పై బరువు వేసి బలంగా ఊపిరి పీల్చడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని పల్స్ ఆక్సి మీటర్ చూపిస్తూ వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు దీని ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. ఈ వీడియోలో ఈ వ్యక్తి చూపిస్తున్నట్లు చేయటం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే ప్రోనింగ్ పొజిషన్ అని పిలుస్తారు. తీవ్రమైన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now