Samantha Naga Chaithanya : స‌మంత, నాగ‌చైత‌న్య పిల్ల‌ల కోసం ప్లాన్ చేసింది నిజ‌మే ? ఇంకో ప్రూఫ్ ఇదే ?

October 18, 2021 2:24 PM

Samantha Naga Chaithanya : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ క‌పుల్‌గా ఉన్న స‌మంత‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ విడిపోవ‌డం ఎంతో మందికి న‌చ్చ‌డం లేదు. ఈ విష‌యాన్ని వారి అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే స‌మంత‌, నాగ‌చైత‌న్య పిల్ల‌ల కోసం ప్లాన్ చేశార‌ని.. ఇటీవ‌లే నీలిమ గుణ చెప్పారు. అందువ‌ల్ల స‌మంత అబార్ష‌న్ కు య‌త్నించింద‌ని వ‌స్తున్న వార్త‌లు నిజం కాద‌ని ఆమె తేల్చేశారు. అయితే ఇప్పుడు ఇంకో కీల‌క విష‌యం బ‌య‌ట ప‌డింది. అదేమిటంటే..

Samantha Naga Chaithanya really planned for baby here it is another proof

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారూఖ్ ఖాన్‌.. ల‌య‌న్ పేరిట అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. న‌య‌న‌తార ఈ మూవీలో న‌టిస్తోంది. అయితే న‌య‌నతార స్థానంలో అస‌లు స‌మంత‌నే ఈ మూవీలో చేయాల్సి ఉంది. కానీ స‌మంత పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తున్నందున సినిమా షూటింగ్ సాధ్య‌ప‌డ‌ద‌ని.. క‌నుక‌నే అట్లీ ద్వారా వ‌చ్చిన ఆఫ‌ర్‌ను తాను వ‌దులుకుంద‌ని తెలుస్తోంది.

ఇక ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా నీలిమ గుణ మొన్నీ మ‌ధ్యే ప‌లు కీల‌క విష‌యాలు చెప్పారు. తాను శాకుంత‌లం కోసం స‌మంత వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు ఆమె సినిమాకు ఒప్పుకుంద‌ని.. కానీ షూటింగ్‌ను మాత్రం ఈ ఏడాది ఆగ‌స్టు వ‌ర‌కు పూర్తి చేయాల‌ని చెప్పింద‌ని.. ఎందుకంటే.. పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తుంది క‌నుక‌.. షూటింగ్ ను త్వ‌ర‌గా ముగించాల‌ని కోరింద‌ని.. నీలిమ గుణ చెప్పారు. అయితే ల‌య‌న్ సినిమా షూటింగ్ ఇంకా ఆల‌స్యం అవుతుంది క‌నుక.. స‌మంత పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తుంది క‌నుక‌.. ఈ మూవీలో చేయ‌డం కుద‌ర‌ద‌ని అట్లీకి స‌మంత చెప్పింద‌ట‌. అందువ‌ల్లే ఆమె స్థానంలో న‌య‌న‌తార చేస్తుంద‌ట‌.

దీంతో స‌మంత పిల్ల‌ల కోసం ప్లాన్ చేసిన‌ట్లు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. అందువ‌ల్లే వేరే సినిమాల‌కు ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. అయితే పిల్ల‌ల కోసం ప్లాన్ చేసిన వారు స‌డెన్ గా విడాకులు ఎందుకు తీసుకున్నారు ? అన్న‌ది చిక్కు ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. కానీ స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల విష‌యంలో క్ర‌మంగా ఒక్కో సందేహం మాత్రం తీరుతూ వ‌స్తోంది. మ‌రి కొంత కాలానికైనా వారి విడాకుల‌కు అస‌లు కార‌ణం అనేది తెలుస్తుందా ? లేదా ? చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now